చెన్నై: చెన్నైలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్, ఈ చర్యకు సహకరించిన అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పాస్టర్ శ్రీలంక జాతీయుడు. చాలా సంవత్సరాలుగా అక్రమంగా చెన్నైలో నివసిస్తున్నాడు. తన చర్చికి హాజరైన చాలా మంది యువతులు, పిల్లలను పాస్టర్ లైంగికంగా వేధించాడు. 16 ఏళ్ళ బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశారు.
పెంటెకోస్టల్ పాస్టర్ అయిన షెరార్డ్ మనోహర్ (58) తన భార్య హెలెన్‌తో కలిసి చెన్నైలో అపోస్టల్ క్రైస్ట్ అసెంబ్లీ – జీసస్ మిరాకిల్స్ మినిస్ట్రీస్ అనే చర్చిని నడుపుతున్నాడు. పాస్టర్ ఆరు నెలలుగా అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు, కాల్స్ ద్వారా బాలికను వేధిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.
తన న్యూడ్ ఫొటోలను యువతికి పంపేవాడు. ఒక సందేశంలో, “కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం తప్పు కాదు” అని చెప్పాడు. విషయం బయటకు రావడంతో అమ్మాయిలకు పంపిన మెసేజ్‌లను డిలీట్ చేశాడు. పోలీసులు వాటిని రికవరీ చేయగా బాలిక ఆరోపణలు నిజమేనని తేలింది.
అతని భార్య అతని లైంగిక నేరాలను దాచడం, సమర్థించడం ద్వారా అతనికి సహాయం చేసింది. పాస్టర్ మంచి వ్యక్తి అని, అతను తనను ఎటువంటి ఇబ్బందులకు గురిచేయలేదని పాస్టర్ భార్య బాధితురాలి వాయిస్‌ను బలవంతంగా రికార్డు చేసింది. అంతేకాదు, ఈ వాయిస్‌ను ఇతరులకు చూపించి, వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. పాస్టర్ తన చర్చికి హాజరవుతున్న చాలా మంది మహిళలు, పిల్లలను దుర్భాషలాడాడని, అయితే వారు అతనిపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని పోలీసులు చెప్పారు. ఇప్పుడు పాస్టర్, అతని భార్య ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తదుపరి విచారణలో పాస్టర్ షెరార్డ్ మనోహర్ భారత్‌లో అక్రమంగా ఉంటున్న శ్రీలంక జాతీయుడని తేలింది.
Source: HINDU POST