Articles

ఈ దేశద్రోహ మీడియా “రో(రా)తలు” ఇంకెన్నాళ్ళు?

768views
స్వయానా పాకిస్థాన్ ప్రధానమంత్రి తమ దేశంలో ఉగ్రావాద మూకలు ఉన్నాయని అంగీకరించి, నూతన పాకిస్తాన్ లో వాళ్ళు తమ కార్యకలాపాలను కొనసాగించి శిక్ష నించి తప్పించుకోలేరని చెప్పడం మనదేశం లోని రాహుల్ వీరాభిమానులకు మతిపోయేలా చేసింది. బాలాకోట్ విషయంలో అడిగినట్టుగా బహుశా ఇక వాళ్ళు సాక్ష్యాలు అడగకపోవచ్చు.

ఇమ్రాన్ ఖాన్ తమ దేశంలో ఉగ్రవాద మూకలు ఉన్నాయని ఒప్పుకున్న విషయాన్ని అంగీకరించాడానికి మన దేశం లోని కాంగ్రెస్ వీర భక్త మీడియా సంస్థలు సిద్ధంగా లేవు.  కానీ- టైమ్స్ అఫ్ ఇండియా, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూస్థాన్ టైమ్స్ లాంటి మీడియా సంస్థలు  2019 ఎన్నికల ముందు భారత్ తమ మీద దాడి చేస్తుందేమో అని ఇమ్రాన్ ఖాన్ భయం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.

రాహుల్ వీరాభిమానులు రెండు విషయాలలోనూ పొరపాటు పడుతున్నారు. ఇమ్రాన్ భయపడినట్టుగా భారత్ ఎప్పుడూ ముందుగా దాడి చేయదు. కానీ, తన మీద దాడి జరిగితే మాత్రం సమర్ధవంతంగా తిప్పికొడుతుంది. అలాగే ఇమ్రాన్ భవిష్యత్తులో తన మాట మీద నిలబడతాడనే నమ్మకం లేదు. మరి అలాంటప్పుడు పాకిస్థాన్ తమ గడ్డ మీద ఉగ్రవాదులున్నారని ఎందుకు ఒప్పుకుంది అనే అనుమానం కొందరికి కలగొచ్చు.

దీనికి కారణం, చైనాకి మిత్ర దేశం గా తమకున్న పరిమితులను గ్రహించింది. అలాగే 18 శాతం వాటాతో అమెరికా ఆధీనంలో ఉన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సహకారం లేకుండా తన మనుగడ కష్టమని అర్ధం చేసుకుంది. ఉగ్రవాదం పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఉన్న అయిష్టతను గ్రహించి అందుకు అనుగుణంగా నడుచుకోకుంటే పాకిస్థాన్ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది.

పాకిస్థాన్ ఆర్ధిక సహాయానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తూ చైనా సహాయం చేస్తున్నప్పటికీ, పాకిస్తాన్ తన కాళ్ళ మీద తాను నిలబడటానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి పన్నెండు బిలియన్ డాలర్ల మేర సహాయం అవసరమవుతుంది. ప్రస్తుతానికి చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ క్రింద పాకిస్తాన్ లో

28.6 బిలియన్ డాలర్ల విలువైన  22 ప్రాధమిక, మౌళిక సౌకర్యాలకు సంబంధించిన ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇందుకోసం 2024 నాటికి పాకిస్థాన్, చైనాకి దాదాపు 100 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తానుకి ఇది పూర్తిగా అసాధ్యం.

ఇమ్రాన్ ఖాన్ చైనా తో తమ దేశానికి ఉన్న క్లయింట్ స్టేటస్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు. పాకిస్తాన్ చైనాకి ఇచ్చిన ప్రధాన రైల్వే ప్రాజెక్ట్ ని 2 బిలియన్ డాలర్ల మేర తగ్గించింది. 14 బిలియన్ డాలర్ల డాం ని చైనా ఆర్ధిక సాయం నించి తప్పించింది. రాబోయే కాలంలో చేపట్టాల్సిన 1320 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.

చైనా యొక్క వేటగాడి దృక్పధం పాకిస్తాన్ ని బాగా బాధ పెడుతోంది. ఉదాహరణకి నాలుగు దశాబ్దాల తరువాత పాకిస్తాన్ కి తిరిగి అప్పచెప్పే గద్వార్ పోర్ట్ మీద చైనా 91 శాతం పన్ను లేని ఆదాయాన్ని పొందుతుంది. చైనా నుంచి పరికరాల దిగుమతులు పెరుగుతున్నాయి, పాకిస్తాన్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు బాగా తగ్గిపోతున్నాయి, చెల్లింపుల విషయంలో తీవ్ర సమస్య ఏర్పడుతోంది.

అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా, అమెరికా ప్రభావం ఎక్కువగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్థాన్ విషయంలో ఉదారంగా ఉండాలంటే దాని నించి పూర్తి పారదర్శకతని కోరుతోంది. అంతేకాక పాకిస్థాన్ కి రుణ స్థిరత్వం ఎంత మేరకు ఉందో తెలుసుకోవడానికి పారదర్శకమైన వివరాలు కావాలని అది అడుగుతోంది. అంటే పాకిస్థాన్ చైనాకి తాను ఎంత బాకీ బాకీ ఉన్నదీ, దానికి సంబంధించిన షరతులు మొదలైన వివరాలు అన్నీ అమెరికాకి వెల్లడించాల్సి ఉంది. అమెరికా మాత్రం పాకిస్తాన్ కి అంతర్జాతీయ ద్రవ్య నిధి నించి సహాయం పొందేందుకు అర్హత లేదని అభిప్రాయపడుతోంది. అమెరికా రాజ్య కార్యదర్శి మైక్ పాంపే మాత్రం చైనాకి ఉన్న అప్పును తీర్చడానికి ఉపయోగపడే సహాయం ఇవ్వడం లో హేతుబద్ధత లేదని అంటున్నారు.

ఇక్కడ మనకి ఒక విషయం స్పష్టమవుతోంది. పాకిస్థాన్ ఇప్పుడు తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి అటు అమెరికాని, ఇటు చైనాని సమర్ధించాల్సిన పరిస్థితిలో ఉంది. పాకిస్థాన్ ప్రస్తుతం తన గడ్డ పైన ఉన్న ఉగ్రవాదుల మీద పెల్లుబికుతున్న అంతర్జాతీయ ఆగ్రహం నుంచి తనని రక్షిస్తూ, చైనా  తన సైన్యానికి కూడా ఇంకా సరఫరా చేయని ప్రోటోటైప్ అణు శక్తి రియాక్టర్లతో సహా అనేక ఆయుధాలను అమ్ముతున్న చైనాను దూరం చేసుకోలేదు. అలాగే ఎవరి మద్దతు లేకపోతే ఒక్క రోజు కూడా గడవదో అటువంటి IMF ని దూరం చేసుకోలేదు.

పాకిస్థాన్, చైనాలు మన దేశాన్ని అదుపుచేయడానికి, వీలైతే నాశనం చేయడానికి జట్టుకట్టిన దేశాలన్న సత్యం మన దేశంలోని ఇమ్రాన్ ఖాన్ ని ఇష్టపడే మేధావులకు అర్ధం కాదు.

చైనా హిమాలయ ప్రాంతం లోని భారత భూభాగాన్ని నిదానంగా తనలో కలుపుకుంటుంటే, పాకిస్థాన్,  అమెరికా కూడా నిషేదించిన  ఉగ్రవాదుల ద్వారా జమ్మూ కాశ్మిర్ లో కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం కాశ్మీర్  లో  35 శాతం భూభాగం పాకిస్థాన్ ఆధీనంలోనూ, 20 శాతం భూభాగం చైనా ఆధీనంలోనూ ఉంది. పాకిస్థాన్ కి ఒక భూమార్గ నడవాని ఏర్పాటు చేయడం ద్వారా అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం తమకు నేరుగా అందుబాటులోకి వచ్చేలా చేసుకోవాలని చైనా కలలు కంటోంది.

ఇప్పుడు IMF  గత ఆరు దశాబ్దాలలో  22 వ సారి ఇస్తున్న సహాయ నిధులు ఇవ్వడం ఆపేస్తే, అది మనకి ఓ శుభవార్త అవుతుంది. పాకిస్థాన్ తన గడ్డ మీద ఉన్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకున్నాను అని నమ్మించగలిగితేనే IMF పాకిస్తాన్ కి ఆ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.

“కేవలం పాకిస్థాన్ యొక్క ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్న కారణంతో ఆ దేశానికి నిధులు సరఫరా చేయలేము. ద్దనికి ముందు తీవ్రవాదంపై తాను కఠిన వైఖరిని అవలంబిస్తానని తాను ప్రపంచానికి చాటాల్సివుంది.” అని IMF ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇమ్రాన్ ఖాన్ తన మాట మీద నిలబడతాడని ఆశించలేము. అలానే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలు, ఇమ్రాన్ ని ప్రధానిగా చేసిన పాక్ మిలటరీ అవిభక్త కవలలు లాంటివి. ఇప్పుడు తీసుకుంటున్న చర్యలన్నీ IMF నిధులు తెచ్చుకునే దాకా అందరినీ మభ్యపెట్టడం కోసం ఉద్దేశించినవి.

కాబట్టి ఈ రాహుల్ వీరభక్త్ మీడియా చెప్తున్న ఒక్క పదాన్ని కూడా చదవద్దని మనవి. భారత దేశం ఎప్పుడూ ఇతర దేశాల మీద దాడులకు దిగబడలేదు భవిష్యత్తులో దిగబోదు. కేవలం మోడీని, భాజాపాని ఒక దయ్యంలాగా చూపించడానికి ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఉగ్రవాదం అంటేనే పాకిస్థాన్, పాకిస్థాన్ అంటే ఉగ్రవాదం. ఈ విషయం ప్రపంచానికంతటికీ తెలుసు. అందుకే యావత్ప్రపంచం పుల్వామా ఘటన విషయంలో పాక్ ను దోషిగా చూస్తోంది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని ఇప్పటికే అమెరికా పలుమార్లు పాకిస్థాన్ ని హెచ్చరించింది. భారత్ తో పెట్టుకుంటే పాక్ కు పుట్టగతులుండవని కూడా పాకిస్థాన్ ని అమెరికా హెచ్చరించింది.

ఇవేవీ పట్టని రాజకీయ పక్షాలు, వారికి అమ్ముడుపోయిన పత్రికలు, శోభాడే, బురఖా దత్, నవజ్యోత్ సిద్ధూ వంటివారు చేసే “ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకున్న శాంతి కాముకుడు ఇమ్రాన్ ఖాన్” అనే పిచ్చి రాతలు, కూతలు, కోతలు మనం వింటూ ఉండక తప్పదు.

Source: RITAM,

తెలుగు అనువాదం : దీవి శేషశాయి.