News

భారత సైన్యం సాధించిన “మైత్రి”.

649views

భారత సైన్యం మరో అద్భుతం సాధించింది. కేవలం 40 రోజుల వ్యవధిలో సింధు నదిపై అతి పెద్ద వేలాడే వంతెనను నిర్మించింది. 260 అడుగుల పొడవైన ఈ వంతెన ఇప్పటివరకు సింధు నదిపై నిర్మించిన వంతెనలలో అతి పొడవైనది. దీని నిర్మాణం కేవలం 40 రోజుల స్వల్ప వ్యవధిలో పూర్తి కావడం ఒక రికార్డుగా నిలుస్తోంది. సాహస మరియు యోగ్యత రెజిమెంట్ కు చెందిన ఇంజనీర్లు, సైన్యం కలసి నిర్వహించిన ఈ ఆపరేషన్లో చుట్టు పక్కల గ్రామాలకు చెందినా స్థానిక ప్రజలు కూడా సహకరించడం విశేషం. భారతసైన్యం ఈ వంతెన నిర్మాణానికి 500 టన్నుల బరువైన నిర్మాణ సామగ్రిని వాడింది. ఈ వంతెనకు “మైత్రి బ్రిడ్జి” అని నామకరణం చేశారు. 1/4/2019న మాజీ సీనియర్ నైనికాధికారులు ఈ వంతెనను ప్రారంభించారు.

కొన్నేండ్ల క్రితం ముంబై నగరంలోఎల్ఫిన్ స్టన్ బ్రిడ్జి కూలిపోయినపుడు సబర్బన్ రైల్వే స్టేషన్లలో 3 కాలిబాట వంతెనల నిర్మాణానికి సైన్యం సహకరించింది. కామన్వెల్త్ క్రీడల సందర్భంగా జవహర్లాల్ నెహ్రు స్టేడియం బయట వున్న వేలాడే వంతెన కూలిపోయినపుడు కూడా అతి తక్కువ కాల వ్యవధిలో ఆ వంతెనను పునర్నిర్మించిన ఘనత కూడా మన సైన్యానికే దక్కుతుంది.