
325views
గాంధీనగర్: భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అథ్లెట్లు అత్యున్నత సమరంలో పోటీ పడే సమయం ఆసన్నమైంది. గుజరాత్‌లో గురువారం 36వ జాతీయ క్రీడలను స్థానిక నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్ ఈ క్రీడలకు వేదికలు. సైక్లింగ్ విభాగంలో పోటీలకు మాత్రం ఢిల్లీ ఆతిథ్యమిస్తోంది. మొత్తం 36 క్రీడాంశాల్లో 7 వేలకు పైగా అథ్లెట్లు తలపడుతున్నారు. చివరిసారిగా 2015లో కేరళలో ఈ క్రీడలు జరిగాయి.





