
బీజింగ్: ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని సూపర్ పవర్‌గా ఎదగాలని ప్రయత్నిస్తున్న డ్రాగన్ కంట్రీ చైనా ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఐర్లాండ్లతో పలు దేశాల్లో ఏర్పాటు చేసిందనే విస్తుపోయే వాస్తవాలను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టికా వెల్లడించింది.
సొంత దేశాల్లోని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా, చైనా ఈ అక్రమ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేయడంపై మానవ హక్కుల ప్రచారకుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ విధంగా 54 అక్రమ పోలీస్ స్టేషన్లను పలు దేశాలలో ప్రారంభించినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఐరోపాలోని 36 ఉండగా, లండన్ లో గల ఒక పోలీస్ స్టేషన్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో పనిచేస్తున్నది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌లతో సహా 16 ఐరోపా దేశాలలో ఇటువంటి పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
ఆయా దేశాలలోని చైనా జాతీయులకు వివిధ అనుమతులు పొందేందుకు, వారు తమ నైపుణ్యం పెంపొందింప చేసుకునేందుకు సహకరించడం కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు చైనా అధికారులు పేర్కొంటున్నా చైనా ప్రభుత్వం పట్ల అసమ్మతితో వ్యవహరించే తమ దేశస్థులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి తిరిగి తీసుకు వెళ్ళి, అక్కడ శిక్షలు పడేవిధంగా చేయడం కోసమే ఇవి పనిచేస్తున్నట్లు పలు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
కెనడాలో…
కెనడాలో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో (పీఎస్‌బీ) పేరిట చైనా అనధికారిక పోలీస్ స్టేషన్లను నిర్వహిస్తున్నట్టు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టికా వెల్లడించింది. స్థానిక మీడియా ఫ్యుజ్హుయో ప్రకారం పోలీస్ సర్వీస్ స్టేషన్లను పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోగా కెనడా వ్యాప్తంగా చైనా విస్తరించింది.
గ్రేటర్ టోరోంటో ఏరియాలోనే కనీసం మూడు పీఎస్‌బీ స్టేషన్లు ఉన్నాయి. చాలా దేశాల్లోని ఎన్నికలను సైతం. అక్రమ పోలీస్ స్టేషన్ల ద్వారా చైనా ప్రభావితం చేస్తోందని రిపోర్టికా వెల్లడించింది.
Source: Nijamtoday





