News

అఫ్గాన్​లో బాంబు దాడి.. ఏడుగురు దుర్మరణం!

54views

కాబూల్‌: అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్‌ మరోమారు బాంబు దాడితో దద్దరిల్లింది. ఓ మసీదుకు సమీపంలో జరిగిన పేలుళ్ళ‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 41మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుళ్ళ అనంతరం.. ఘటనాస్థలిలో దట్టంగా పొగలు అలుముకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మసీదులో ప్రార్థనలు ముగించుకొని బయటకు వెళ్ళే వారు లక్ష్యంగా బాంబు పేలుడు జరిగినట్లు కాబూల్‌ పోలీసు చీఫ్‌ ఖలీద్‌ జద్రాన్‌ తెలిపారు. దాడులకు సంబంధించి ముమ్మర దర్యాప్తు జరుగుతున్నట్టు తాలిబన్ల ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి