News

పీఎఫ్ఐ బంద్ పిలుపుపై కేరళ హైకోర్టు ఆగ్రహం

223views

తిరువనంతపురం: ఎన్ఐఎ సోదాలు నిరసనగా బంద్ పిలుపు ఇవ్వడంపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పట్ల కేరళ హైకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా బంద్‌లకు ఎవరూ పిలుపునివ్వకూడదని స్పష్టం చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడిన నేపథ్యంలో 12 గంటల బంద్‌కు పీఎఫ్ఐ పిలుపునివ్వడాన్ని తప్పుబట్టింది.

తిరువనంతపురంలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ సభ్యులు వాహనాలు ధ్వంసం చేశారు. పార్టీ సభ్యలు దాడిలో కారు, ఆటో అద్దాలు ధ్వంసమ్యయాయి. కొల్లాంలో సెక్యూరిటీ కోసం వచ్చిన ఇద్దరు పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి