News

నీటిపై తేలుతున్న గణనాథుని రాతి విగ్రహం

381views

* నామక్కల్‌ శిల్పి అద్భుత సృష్టి

మిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ ‌కు చెందిన శిల్పి నీటిపై తేలాడే రాతి వినాయక విగ్రహాన్ని రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

నామక్కల్‌ జిల్లా కూలిపట్టికి చెందిన జగదీశన్‌ శిల్పి. ఏక శిలతో రథం, పిల్లనగ్రోవి తయారు చేసి 2009లో విదేశాంగ మంత్రిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పురష్కారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చతుర్థిని పురస్కరించుకొని రాతితో వినాయక విగ్రహం, పీఠం, పడవ తయారు చేశారు. ఇది రాతి విగ్రహమే అయినా నీటిలో తేలుతుండడం ఈ విగ్రహం ప్రత్యేకత. విగ్రహం, పీఠం, పడవ రూపంలో ఉన్న రాతిపై నీటిలో తేలే విధంగా దీనిని రూపొందించారు. దీన్ని ప్రజలు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. జగదీశన్‌ మాట్లాడుతూ.. నీటిపై తేలాడే విధంగా బరువుకు తగ్గట్లుగా తయారు చేసినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.