321
* ఆజాద్ రాజేనామా అనంతరం కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు
వరుస ఓటములు, రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. జమ్మూకశ్మీర్ కు చెందిన 50 మందికిపైగా సీనియర్ నేతలు మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించారు. ఇటీవల హస్తం పార్టీని వీడిన గులాంనబీ ఆజాద్ కు మద్దతుగా వారంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.
‘ఆజాద్ కు మద్దతుగా మేం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను సమర్పించాం’ అని మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వారు తమ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. తాజాగా బయటకు వెళ్లిన వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల్ మాజిద్ వని, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్ తదితరులు ఉన్నారు.