News

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల

85views

* శ్రీనివాసుడి పుష్కరిణిని శుభ్రం చేస్తున్న తితిదే సిబ్బంది

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి సిద్ధమైంది. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలో మరమ్మతులు నిర్వహించి నీరు నింపడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పుష్కరిణి మరమ్మతు పనులు ప్రారంభించారు. నీటిని తొలగించి అడుగు భాగాన్ని శుభ్రపరచారు. తర్వాత పైపులకు మరమ్మతులు పూర్తిచేసి ఊట గుంటలను పరిశుభ్రపరిచారు. మరమ్మతులు పూర్తయ్యాక పుష్కరిణిలో పెయింటింగ్‌, ఇతర సివిల్‌ పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.