News

భారత్ చుట్టుపక్కల సైనిక విస్తరణకు చైనా కుయుక్తులు!

410views
  • ఆఫ్రికాలో నౌకా స్థావరం ఏర్పాటు

  • యుద్ధనౌకల తరలింపు

  • భారత ఉపగ్రహ సమాచారం తస్కరించేందుకు న‌క్క‌బుద్ధులు

న్యూఢిల్లీ: భారత్‌ చుట్టుపక్కల సైనిక ఉనికిని పెంచుకుంటున్న చైనా.. తన కుయుక్తులను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తన తొలి విదేశీ నౌక స్థావరానికి యుద్ధ నౌకలను తరలించింది. 2016లో 590 మిలియన్ డాలర్ల వ్యయంతో హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికాలో డ్రాగన్‌ తన తొలి విదేశీ నౌకా స్థావరం నిర్మాణం చేపట్టింది.

ప్రస్తుతం అక్కడ యుద్ధనౌకను మోహరించింది. అందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు మీడియాకు అందాయి. హిందూ మహా సముద్రంలో పట్టు బిగించటమే లక్ష్యంగా డ్రాగన్‌ కుయుక్తులు పన్నుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకంగా భావించే సూయజ్ కాల్వ మార్గంలో ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను వేరు చేసే వ్యూహాత్మక బాబ్-ఎల్-మాండెబ్ జలసంధిలో చైనా నౌకాస్థావరం ఉంది. దీన్ని ప్రత్యక్ష దాడిని తట్టుకునేలా నిర్మించినట్టు సమాచారం.

యుజావో యుద్ధ నౌకను మోహరించినట్టు మాక్సర్‌ ఉపగ్రహ ఛాయచిత్రాలు చాటుతున్నాయి. ఇది 25 వేల టన్నుల బరువు, 800మంది సైనిక సామర్థ్యం కలిగిన ఈ యుద్ధనౌకపై వాహనాలతోపాటు జెట్‌ ఫైటర్లను మోహరించవచ్చు. ఇది ట్యాంకులు, ట్రక్కులు, హోవర్ క్రాఫ్ట్‌లను మోయగలదు. ఇటీవలె శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవులో 25వేల టన్నుల యువాన్‌ వాంగ్‌ యుద్ధనౌకను మోహరించిన చైనా తొలి విదేశీ నౌకా స్థావరంలోనూ కార్యకలాపాలు ప్రారంభినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి