
న్యూఢిల్లీ: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర సమాచార -ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా స్వరాజ్య సముపార్జన దిశగా దేశం సాగించిన పయనాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తూ ‘స్వరాజ్… భారత్ కే స్వతంత్రత సంగ్రామ్ కీ సమగ్ర గాథ’ అనే మెగా సీరియల్‌ను దూరదర్శన్ నిర్మించింది.
ఈ సీరియల్‌ను ఈ నెల 20వ తేదీ నుంచి ‘డీడీ యాదగిరి’ చానెల్‌లో తెలుగులో ప్రసారం చేయనున్నట్టు దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వీ రమణ, డిప్యూటీ డైరెక్టర్ సురేఖ వెల్లడించారు. ప్రతి శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతుందని తెలిపారు.
అలాగే ఆదివారం రాత్రి 9.30 గంటలకు, బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటలకు మళ్ళీ ప్రసారం అవుతుందని చెప్పారు. 75 ఎపిసోడ్ల ఈ సీరియల్‌ను ప్రజలు తప్పనిసరిగా చూడాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ సీరియల్ మొదటి ఎపిసోడ్‌ను ఇటీవలే కేంద్ర మంత్రులతో కలిసి న్యూఢిల్లీలో చూశారని తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు మనోజ్ జోషి ఈ సీరియల్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఒక పాత్రను పోషించారు. స్వరాజ్ ధారావాహిక సీరియల్ ఆడియో వెర్షన్ ఆలిండియా రేడియో నెట్‌వర్క్‌లో ప్రతి శనివారం ఉదయం 11 నుంచి ప్రసారమవుతుంది.
ఈ సీరియల్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, ఇంగ్లీషులలో ఎనిమిది ప్రాంతీయ భాషలలో కూడా డబ్ చేశారు. ‘స్వరాజ్- భారత్ కే స్వతంత్రత సంగ్రామ్ కి సమగ్ర గాథ’, వాస్కో-డగామా భారతదేశంలో అడుగుపెట్టిన 15వ శతాబ్దం నుండి భారతదేశ స్వాతంత్య్ర పోరాటపు అద్భుతమైన చరిత్రను వివరించే 75-ఎపిసోడ్ మెగా షో.
ఈ సీరియల్ స్వాతంత్య్ర పోరాటంలో అంతగా తెలియని వీరుల జీవితాలు, త్యాగాలతో పాటు భారతీయ చరిత్రలోని అనేక అంశాలను ప్రదర్శిస్తుంది. డాక్యుమెంట్-డ్రమా ఫార్మాట్‌లో ప్రదర్శించబడుతున్న ఈ సీరియల్‌ను ప్రముఖ చరిత్రకారుల బృందం బాగా పరిశోధించింది. ప్రముఖ సినీ నటుడు మనోజ్ జోషి ఈ సీరియల్ వ్యాఖ్యాతగా (సూత్రధార్) ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు.
Source: Nijamtoday





