
314views
ఢాకా: బంగ్లాదేశ్‌లోని మా కాళి ఆలయాన్ని అపవిత్రం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల ఆరోతేదీ రాత్రి బగేర్‌హాట్ జిల్లాలోని మోంగ్లా ఉపజిల్లాలోని కనైనగర్‌లోని సర్బజనిన్ కాళి ఆలయంలో మా కాళి మూర్తితో సహా రెండు మూర్తిలను నిందితులు అపవిత్రం చేసి, పగలగొట్టారు.
మరుసటి రోజు ఉదయం ఆలయంలోని పూజారులు పూజల కోసం లోపలికి ప్రవేశించినప్పుడు నేలపై పడి ఉన్న రెండు మూర్తుల విరిగిన భాగాలు కనిపించాయి. ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం, అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు – రహత్ చౌదరి, 20, నయన్ మున్షీ, 24 ఆసిఫ్ ఖాన్, 22.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు మోంగ్లా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి మనీరుల్ ఇస్లాం తెలిపారు.
Source: HINDU POST