NewsProgramms

సంఘమిత్రలో పెల్లుబికిన సమరసతా స్ఫూర్తి

455views

నంద్యాల జిల్లా, స్థానిక నంద్యాల సంఘమిత్ర ఆవాసం లో 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘమిత్ర ఆవాసం చిన్నారులు శ్రీ మంగలి వెంకట రమణ (నాయీ బ్రాహ్మణుడు), శ్రీ నాగేశ్వరరావు ఆటో డ్రైవర్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి, త్రివర్ణ పతాకను ఎగురవేయించి సమాదరణ ఆదర్శాన్ని ఆచరణలో చూపెట్టటం విశేషం.

వక్తలు మాట్లాడుతూ.. పిల్లలందరూ మన దేశంలోని మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శపౌరులుగా ఎదిగి దేశం కోసం, ధర్మం కోసం సమైక్యంగా పోరాడుతూ ఎలాంటి త్యాగాలకైన వెన్ను చూపని వీరులు గా కీర్తిగడించాలని ఆశీర్వదించారు‌.

శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి సంఘమిత్ర సందర్శన

ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక గాయకురాలు, అన్నమయ్య ప్రాజెక్ట్ సంచాలకులు శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి సంఘమిత్ర ఆవాసాన్ని సందర్శించి, చిన్నారులతో భజన చేయించారు, ఆధ్యాత్మిక గీతాలు పాడి భక్తి పారవశ్యాన్ని నింపారు. స్ఫూర్తిదాయకమైన ఆశీః ప్రసంగం చేశారు.

ఈ కార్యక్రమంలో విభాగ్ కార్యకారిణి సభ్యులు డాక్టర్ ఉదయ్ శంకర్, సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.