News

న్యూయార్క్ లో చోళుల కాలం నాటి పార్వతీదేవి విగ్రహం…

101views

* అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసిన భారత ఐడల్‌ వింగ్‌ క్రిమినల్‌ ఇన్విస్టేగేషన్‌ డిపార్ట్ ‌మెంట్‌(సీఐడీ)

చోళుల కాలం నాటి పురాతన పార్వతి దేవి విగ్రహం న్యూయార్క్ ‌లో ఉన్నట్లు ఐడల్‌ వింగ్‌ క్రిమినల్‌ ఇన్విస్టేగేషన్‌ డిపార్ట్ ‌మెంట్‌(సీఐడీ) పేర్కొంది. న్యూయార్క్ ‌లోని బోన్ ‌హామ్స్‌ వేలం హౌస్ ‌లో ఈ విగ్రహాన్ని గుర్తించినట్లు సీఐడీ తెలిపింది. ఈ విగ్రహం విషయమై 1971లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. గానీ 2019లో ఫిబ్రవరి కె వాసు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడూ కేసు నమోదు చేసి వదిలేశారు.

ఐతే ప్రస్తుతం ఐడల్ వింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం చిత్ర ఈ కేసును దర్యాప్తు చేయడంతో వివిధ మ్యూజియంలు, వేలం హౌస్‌లపై దర్యాప్తు చేయడం ప్రారంభించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ మేరకు ఆమె బోన్ ‌హామ్స్‌ వేలం హౌస్ ‌లో ఈ విగ్రహాన్ని కనుగొన్నారు. ఇది సుమారు 12వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 52 సెం.మీటర్లు ఉంటుంది.

పైగా ఈ విగ్రహం విలువ సుమారు ఒకటిన్నర కోట్లు ఉంటుందని చెబుతున్నారు అధికారులు. విగ్రహం నుంచున్న ఆకృతిలో ఉండి కిరీటం, కంఠాభరణాలు , హస్తాభరణాలు, వస్త్రాలతో రూపొందించబడి ఉంటుంది. వాస్తవానికి ఈ విగ్రహం కుంభకోణంలో తందంతోట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలో అదృశ్యమైన పార్వతి దేవి విగ్రహం. ప్రసుతం అధికారులు ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు సంబంధిత పత్రాలను సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.