
-
ధిక్కరిస్తే పైపులతో దాడి
-
ఎన్జీవోల ఊబిలో నిరుపేదలు
చెన్నై: తమిళనాడులో మంచిమాటలతో మత మార్పిడి జరుగుతోంది… నిరుపేదల అభ్యున్నతికి పాటుపడతామంటూ ప్రచారం చేసుకుంటున్న క్రిస్టియన్ ఎన్జీవోలు ఈ దురాగతానికి పాల్పడుతున్నాయి. ఇప్పటికే అమాయకులు వీరి ఊబిలో చిక్కుకున్నారు. అంతేకాదు… వారి ఆదేశాలను ధిక్కరించిన వారిపై దాడులు.. అప్పటికీ లొంగకపోతే వారిని కిడ్నాప్ చేసి, తలలు నరికివేస్తున్నారు. ఈ ఘోరాలను పసిగట్టిన బీజేపీ, హిందూ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తంచేయడంతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. కిడ్నాప్‌కు గురైన వారిని రక్షించింది.
వివిధ ఎన్జీవోలకు చెందిన మానవ హక్కుల ‘కార్యకర్తలు’ అని పిలవబడే వ్యక్తులు వీధి నుండి ప్రజలను తీసుకువెళ్ళారు. కోయంబత్తూరు శివార్లలోని ‘ఆశ్రయం గృహం’లో వారిని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసుల సహాయంతో బంధించారు.
భవనం నుంచి కేకలు వినిపించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. భవనాన్ని సందర్శించిన తహశీల్దార్ తమ ఇష్టానికి విరుద్ధంగా వారిని అక్కడే ఉంచినట్టు గుర్తించారు. వార్త వ్యాప్తి చెందడంతో హిందూ సంఘాలు, బీజేపీ సంఘటనా స్థలానికి చేరుకుని ఖైదీలను విడుదల చేయాలని నిరసనకు దిగాయి.
8 அடியாட்கள் சேர்ந்து சதாரண மனிதர்களை தேடி தேடி கடத்தி வந்து அடைத்து வைத்திருந்தனர்
கோவை போன்ற நகரத்தில் இது போன்ற கொடுமைகளை செய்ய முடிகிறதென்றால் மற்ற ஊர்களை பற்றி நினைக்கவே பயமாக இருக்கிறது. pic.twitter.com/9s8fdbxxQC
— Selva Kumar (@Selvakumar_IN) July 29, 2022
హిందూ సంస్థలు జోక్యం చేసుకున్న తర్వాత, ఖైదీలను కొట్టడం, వారి ఆస్తులు లాక్కోవడం, వారి ఇష్టానికి విరుద్ధంగా వ్యవహరించడం వంటివి స్థానికులకు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
బాధితుల్లో చాలా మంది తమ పనిని చేసుకుంటూ బతుకుతుండగా, ఎన్‌జీవోలు వారిని నిరాశ్రయులుగా, మానసిక వికలాంగులుగా పేర్కొంటూ పోలీసుల సహాయంతో అపహరించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో, అపహరణకు గురైన వ్యక్తులు లాక్ చేయడానికి అభ్యంతరం చెప్పినప్పుడు పీవీపీ పైపులతో కొట్టారని ఏడుస్తున్నారు.
తమ వద్ద ఉన్న డబ్బు, బట్టలు, ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను ఎన్జీవో సభ్యులు లాక్కున్నారని ఆరోపించారు. ‘కార్యకర్తలు’ కూడా వారి తలలు ముసిగేసి, అర్ధనగ్న స్థితిలో ఫోటోలు తీశారు. వారిలో ఒకరు తాను ప్రింటింగ్ యూనిట్‌లో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, ఎన్జీవో బృందం తనను బలవంతంగా తీసుకువెళ్ళిందని బోరుమన్నాడు.
కన్నీరు కారుస్తున్న కిడ్నాప్ బాధితులు
నటరాజన్ అనే 47 ఏళ్ల వ్యక్తి TOIతో ఇలా అన్నాడు, “మాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను భవన నిర్మాణ కార్మికుడిని, నా స్వగ్రామంలో నాకు కుటుంబం ఉంది. కానీ ఎన్‌జీవో సభ్యులు నన్ను నిరుపేదగా గుర్తించారు”.
తన అనారోగ్యానికి మందులు తీసుకుని ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్ళి వ్యాన్‌లోకి నెట్టారు.
భిక్షాటన చేస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తిని కూడా బలవంతంగా తీసుకెళ్ళి భవనంలోకి లాక్కెళ్లారు.
పని ముగించుకుని రాత్రి 11.30 గంటలకు బస్సు కోసం ఎదురు చూస్తున్న తనను ‘కార్యకర్తలు’ కిడ్నాప్ చేశారని మరో వ్యక్తి ఆరోపించాడు.
ఎన్జీవో సభ్యులు తమ గుర్తింపు కార్డులతో సహా తమ ఆస్తులను తగులబెట్టారని బాధితులు ఆ వీడియోలో ఆరోపించారు.
ఖైదీలు, గ్రామస్తులు నిరసన తెలపడంతో తహశీల్దార్, పోలీసు సూపరింటెండెంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఖైదీలను విచారించారు.
ఫిర్యాదు ఆధారంగా తొండముత్తూరు పోలీసులు విలుప్పురంలోని అన్బు జోతి ఆశ్రమానికి చెందిన బి.జుబిన్(44), పరలోగతిన్ పథాయ్ ట్రస్ట్‌కు చెందిన కె.జార్జ్, పుగలిడం ట్రస్ట్‌కు చెందిన ఎ.సెల్విన్ (49), మీట్‌పు ట్రస్ట్‌కు చెందిన వి.బాలచంద్రన్ (36), అన్బు జోతి ఆశ్రమానికి చెందిన సి.అరుణ్ (36), అడైక్కాల కరంగల్‌కు చెందిన ఎస్.సైమన్ సెంథిల్‌కుమార్ (44)లను అరెస్టు చేశారు.
ఎన్జీవోలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీజేపీ, హిందూ సంస్థలు అక్రమంగా అవయవదానం చేశారని, బలవంతంగా మత మార్పిడి చేశారని ఆరోపించారు. కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యే, బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ ఈ అపహరణల వెనుక మత మార్పిడులే కారణమన్న అనుమానంతో ఈ అంశంపై సీబీ-సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Source: HINDU POST