
-
మేనకోడలను వేధించడాన్ని అడ్డుకున్నందుకే హత్య..
బీహార్: హిందూ బాలికలను మాంసం ముక్క లేదా మాల్-ఎ-ఘనిమత్‌గా భావించే ముస్లిం వ్యక్తుల చేతిలో మరో హిందూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎప్పటిలాగే పోలీసులు ఈ సంఘటనను నీరుగార్చడానికి ప్రయత్నించారు. నిజానికి ఈ కేసు ఒక నెల పాతది. అయినప్పటికీ ఏ ఒక్క ప్రధాన మీడియా లేదా రాజకీయ నాయకుడు దీనిపై దృష్టి సారించడం లేదు. స్వరాజ్య జర్నలిస్టు సుభి విశ్వకర్మ చొరవ చూపకపోతే ఈ ఘటన ఎన్నటికీ సమాజానికి తెలిసివుండేది కాదేమో…
వివరాలివి…
తన మేనకోడలు కాజల్‌ను వెంబడించి, ఆమె వివాహ జీవితంలో జోక్యం చేసుకుంటున్న ముస్లిం వ్యక్తి మహ్మద్ అజ్మల్ నదాఫ్‌పై ధరమ్ సింగ్ సాహు, అతని సోదరులు ఎదురుతిరిగారు. దీంతో అతను నిమిషాల వ్యవధిలో ఒక ముస్లిం గుంపును కూడగట్టాడు. ఇస్లామిక్ యుద్ధ నినాదం “నారా-ఎ-తక్బీర్…అల్లా-ఓ-అక్బర్”ని పఠిస్తూ వారు ధరమ్, అతని కుటుంబంపై దారుణంగా దాడి చేశారు.
“హిందువులు చాలా ఎక్కువగా పెరుగుతున్నారు, వారిని హలాల్ చేద్దాం.” అంటూ దాడి చేశారు. ఈ గుంపులో చాలా మంది ముస్లిం మహిళలూ ఉన్నారు.
ఈ దాడి ఒక నెల క్రితం అంటే, జూన్ 15న జరిగింది. మరుసటి రోజు దర్భంగా జిల్లా ఘనశ్యాంపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ముస్లింల దాడిలో ధరమ్‌కు చాలా గాయాలయ్యాయి. ఘన్‌శ్యాంపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి అతన్ని దర్భంగా జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయినా ఫలితం దక్కలేదు. అక్కడ అతను మరణించాడు.
ధరమ్‌కు ఒక సంవత్సరం క్రితమే వివాహమైంది. అతనికి భార్య, మూడు నెలల కుమార్తె ఉన్నారు. అతను, అతని సోదరుడు అజయ్ గురుగ్రామ్‌లో ఆటో-రిక్షాలు నడిపేవారు. వారి తండ్రి బార్సీ (మొదటి వర్ధంతి) కోసం బీహార్‌కు తిరిగి వచ్చారు. ఆ ప్రాంతంలో ఏడు హిందూ కుటుంబాలు ఉండగా, 250 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి.
పోలీసుల నిర్లక్ష్యం!
ఈ సంఘటనలో 10 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారని బాధిత కుటుంబం పోలీసులు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ 20 మంది నిందితులను అరెస్టు చేయలేదు. హిందువుల తీవ్ర నిరసనల తర్వాత ఓ 13 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు.
స్థానిక అధికారుల తీరిది…
ఈ సంఘటనను సోషల్ మీడియా ద్వారా సభ్య సమాజానికి తెలియనివ్వకుండా స్థానిక అధికారులు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఇదిలావుంటే, ధరమ్ సింగ్ సాహు, అతని కుటుంబం కోసం ప్రధాన బీజేపీ లేదా జెడియు నాయకులు ఎవరూ మాట్లాడలేదు.
Source: HINDU POST