News

కన్హయ్య హత్యను నిరసిస్తూ ఉదయ్‌పూర్‌లో భారీ నిరసన ప్రదర్శన

517views

ఉద‌య్‌పూర్‌: కన్హయ్య హత్యను నిరసిస్తూ ‘సర్వ హిందూ సమాజ్‌’ ఉదయ్‌పూర్‌లో పిలుపునిచ్చిన ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. టౌన్‌ హాల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు జరిగిన ఈ ర్యాలీలో పలు హిందూ సంస్థల సభ్యులు సహా వేల మంది పాల్గొన్నారు. కాషాయ జెండాలను రెపరెపలాడించారు. ‘జై శ్రీరామ్‌’, ‘హిందువుల హత్యలు ఆపండి’ అంటూ కొంతమంది నినాదాలు చేశారు. నిర్దేశిత మార్గంలో కర్ఫ్యూ సడలించి ర్యాలీని అనుమతించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు- కన్హయ్య హంతకులకు ఉరిశిక్ష విధించాలంటూ రాష్ట్రపతికి రాసిన విజ్ఞాపన పత్రాన్ని కొంతమంది సాధువులు ఉదయ్‌పూర్‌లో కలెక్టర్‌కు అందజేశారు. బంద్‌ నేపథ్యంలో నగరమంతటా మార్కెట్లు గురువారం మూతపడ్డాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.