News

డీజీపీనీ వదలని సైబర్‌ నేరగాళ్ళు!

370views

భాగ్య‌న‌గ‌రం: ప్రముఖుల ఫొటోలను వాట్సాప్‌ డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్ప డుతున్న సైబర్‌ నేరగాళ్ళు ఈ సారి ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకొని అధికారులు, ప్రజలకు టోకరా వేసే ప్రయత్నం చేశారు. ఓ నంబర్‌కు మహేందర్‌రెడ్డి ఫొటో పెట్టి ఒక అధికారికి మెసేజ్‌ పెట్టారు. వెంటనే ఆ అధికారి అప్రమత్తమై మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు.

దీనిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నైజీరియా నుంచి సైబర్‌ మోసగాళ్ళ‌ ఈ పని చేసినట్టు గుర్తించారు. సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీకి ఫిర్యాదు చేసి ఆ సెల్‌ నంబర్‌ను బ్లాక్‌ చేయించినట్టు అధికారులు వెల్ల డించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి