News

మదర్సాలలో యోగ డే

164views
  • యోగా చేయాలంటూ యాజమాన్యాలకు ఆదేశాలు

ల‌క్నో: అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సుమారు 16,000 మదర్సాలలో యోగా నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ యోగా బోర్డు యోగా చేయాలని అంటూ మదరసాలకు ఆదేశాలు జారీ చేసింది.

మదరసాలలో యోగా చేయడం ఇది మొదటిసారి కాదని మదర్సా బోర్డు రిజిస్ట్రార్ జగ్‌మోహన్ సింగ్ తెలిపారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో యోగా నిర్వహించినట్టు చెప్పారు. కానీ, ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా యోగా నిర్వహించాలని యూపీ యోగా బోర్డు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.

“భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి యోగా. దీనిని సమాజంలో కొంత మందికి అందకుండా చేయడం సరైంది కాదు. మదర్సాలలో కూడా యోగా చేస్తారు. మేమొక వారం రోజులుగా ఇక్కడ యోగా చేస్తున్నాం. ఇది అలవాటుగా మారిపోయింది. మేము దీనిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. దీని వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో, వారు పూర్తి సామర్ధ్యంతో చదువుకుని, పనులు చేసేందుకు ఉపయోగపడుతుంది” అని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి