
270views
తిరుపతి: తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద (పేరూరు బండపై) టీటీడీ నిర్మించిన శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా జలాధివాసం నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కలశారాధన, ఉక్తహోమాలు, చతుర్దశ కలశ స్నపనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం శ్రీ వకుళమాత అమ్మవారి విగ్రహానికి జలాధివాసం నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి వేద మంత్రాల మధ్య మంత్రించిన జలంతో విశేషంగా ప్రోక్షణ (జలాధివాసం) చేయడం వలన విగ్రహంలో ఎలాంటి దోషాలు ఉన్నా, తొలగి ప్రతిష్టకు యోగ్యం అవుతుందని అర్చకులు తెలిపారు. తరువాత కుంభారాధన, ఉక్త హోమాలు చేపట్టారు.