News

సేవాభారతి వారి ‘ధన్వంతరి క్లినిక్’ పునఃప్రారంభం

379views

విజయవాడ సేవాభారతి వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా గుణదల పరిసర ప్రాంతాలలో నిర్వహింపబడుతున్న “ధన్వంతరి క్లినిక్” వైద్య సేవలు నేడు పునఃప్రారంభమయ్యాయి.

గత 25 సంవత్సరాలుగా సేవా భారతి, విజయవాడలోని గుణదల పరిసర ప్రాంతాలలో ‘ధన్వంతరి క్లినిక్’ ద్వారా పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది. కొన్ని అనివార్య కారణాలవల్ల కొంతకాలం క్రితం ఆ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఇప్పుడు తాజాగా విజయవాడలోని ఎల్ ఐ సి కాలనీలో గల సేవా భారతి కార్యాలయం నందు ఉచిత వైద్య సేవలు ధన్వంతరి క్లినిక్ ద్వారా పునః ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సేవా భారతి అధ్యక్షులు డాక్టర్ సాయి కిశోర్ రోగులను పరీక్షించి అవసరమైనవారికి మందులను అందజేశారు.

ఈ క్లినిక్ ద్వారా ఉచిత వైద్య సేవల తో పాటు, అందుబాటులో ఉన్న మేరకు అవసరమైనవారికి మందులు కూడా ఉచితంగానే అందజేస్తామని నిర్వాహకులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సేవాభారతి కార్యదర్శి శ్రీ సుబ్బ శేఖర్, కోశాధికారి శ్రీ మాదిరాజు మాధవ, కోఆర్డినేటర్ శ్రీ రామకృష్ణ, శ్రీ జీవీ రెడ్డి, శ్రీ సురేష్ బాబు, శ్రీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.