
396views
తిరుచానూరు: తిరుచానూరులో శ్రీవారి దేవేరి పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున రుక్మిణి, సత్యభామ సమేత కృష్ణస్వామి పద్మ సరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్స వం, ఊంజల్ సేవలను రద్దు చేశారు. కరోనా కారణంగా రెండేళ్ళ విరామం తర్వాత పద్మసరోవరంలో ఉ త్సవాలు జరగడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. డిప్యూటీఈవో లోకనాథం,అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.





