
447views
-
ఈ సారి 50 అడుగుల ఎత్తు మట్టి విగ్రహాన్ని తయారు చేయనున్నట్టు వెల్లడి
భాగ్యనగరం: ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ తయారీకి అంకురార్పణ చేశారు. కర్రపూజతో విగ్రహ తయారీని ఉత్సవ నిర్వాహకులు ప్రారంభించారు. ఈ ఏడాది పంచముఖ లక్ష్మీవినాయక అవతారంలో ఖైరతాబాద్ గణేష్ కొలువు తీరునున్నారు. ఈ సారి 50 అడుగుల గణేశుడి మట్టి విగ్రహం తయారీకి శ్రీకారం చుట్టారు. పీవోపీ విగ్రహాలపై ఆంక్షలతో గణేశుడి విగ్రహం ఎత్తును నిర్వాహకులు కుదించారు. కర్రపూజలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.





