
464views
వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన గంగమ్మ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఈ ప్రభలపై అధికార పార్టీ నేతలు అశ్లీల నృత్యాలు చేయించారు. మహిళల చుట్టూ చేరి, అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు చిందులేశారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీల నృత్యాలు చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఎమ్మెల్యే అండదండలతోనే ఈ తరహా కార్యక్రమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.





