
-
పోలీసులకు ఫిర్యాదు, అదుపులో నిందితురాలు
గువాహటి: పాఠశాలలో గో మాంసం తిన్న ఓ ఉపాధ్యాయురాలిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు గోల్పారా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపధ్యాయురాలిగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిశీలన కార్యక్రమం కొనసాగుతుండగానే ఆమె.. బీఫ్‌ను తీసుకొచ్చారని పోలీసులు వెల్లడించారు.
లంచ్ సమయంలో టీచర్ బీఫ్ తినడాన్ని చూసిన తోటి ఉపాధ్యాయుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్‌పై కేసు పెట్టారు. మతపరమైన సెంటిమెంట్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అసోంలో బీఫ్ అమ్మకంపై నిషేధం ఉంది. గతేడాదే ఈ మేరకు చట్టం తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. దీని ప్రకారం… హిందువులు, జైనులు, సిక్కులు అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు మందిరాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో పశువుల వధ, విక్రయం నిషేధం. ప్రస్తుతం ఘటన జరిగిన పాఠశాల.. మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతంలో ఉండటం గమనార్హం.