News

జ్ఞాన్‌వాపిలో శివలింగం కనిపించడంపై వీహెచ్‌పీ సంతోషం

533views

వార‌ణాసి: వారణాసిలోని జ్ఞాన్‌వాపిలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించిందంటే అది ఆలయమేనని వెల్లడైన్న‌ట్టేన‌ని అని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. జ్ఞాన్‌వాపి ఆలయంలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించడం పట్ల విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ న్యాయవాది అలోక్‌ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు.

“శివలింగంను ఇరు పక్షాలు, వారి న్యాయవాదుల సమక్షంలో కనుగొన్నారు. అందువల్ల శివలింగం ఉన్న ప్రదేశం ఒక దేవాలయం. ఈ ఆలయం ఇప్పటికీ ఉందని, ప్రాథమిక నిర్మాణం ధర్మబద్ధమైన, మతపరమైన లక్షణం ఉందని ఈ వాస్తవం స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్థలం 1947లో కూడా ఒక దేవాలయంలా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

జ్ఞాన్‌వాపి సర్వేలో లభించిన ఈ చక్కటి నిరూపితమైన సాక్ష్యాన్ని దేశ ప్రజలందరూ ఆమోదించి గౌరవిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జ్ఞాన్వాపిలోని శివలింగ్ ను న్యాయస్థానం భద్రపరిచి, సీలు వేసిందని చెబుతూ ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశం తార్కిక ముగింపున‌కు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ అంశం ఇంకా కోర్టులో ఉన్నందున ఇకపై వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతూ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత విశ్వహిందూ పరిషత్ దానిని మరింత పరిగణలోకి తీసుకుంటుందని, ఆ తర్వాతే తదుపరి చర్య ఏమిటనేది నిర్ణయిస్తుందని ఆయన ప్రకటించారు.

“శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని నిర్మించే వరకు న్యాయస్థానం తీర్పు కోసం వేచి చూస్తామని మేము చెప్పాము. ఇప్పుడు మారిన పరిస్థితులలో, జూన్ 11-12, 2022 తేదీలలో హరిద్వార్‌లో జరుగనున్న మా కేంద్రీయ మార్గదర్శక్ మండల్ సమావేశంలో గౌరవనీయులైన సంత్ సోదరుల ముందు మేము ఈ విషయాన్ని ఉంచుతాము” అని ఆయన తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి