News

పాస్టర్ ఆక్రమించిన రూ.12 కోట్ల త‌మ ఆస్తిని ఇప్పించండి

588views
  • న్యాయం కోసం హిందూ కుటుంబం మోకాళ్ళ‌పై నిరసన

చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఓ హిందూ కుటుంబానికి చెందిన రూ.12 కోట్ల ఆస్తిని ఓ పాస్టర్ ఆక్రమించాడు. దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నించి, విఫలమవడంతో కుటుంబ సభ్యులు తమ ఆస్తిని రికవరీ చేయాలని సీఎం ప్రత్యేక సెల్‌కు విన్నవించుకుంటూ మోకాళ్ళ‌పై నిలబడి నిరసన తెలిపారు. పాస్టర్ 42 ఏళ్ళ కింద‌ట ఆస్తిని అద్దెకు తీసుకున్నాడు. దానిపై చర్చిని నిర్మించాడు. ఇప్పుడు అద్దె చెల్లించ‌డం లేదు. ఆ ఆస్తి నుండి బయటకు వెళ్ళ‌డానికి నిరాకరించాడు.

చెన్నైలోని సెలయూర్‌కు చెందిన గోదండరామన్ ఒట్టేరిలోని స్ట్రాహాన్స్ రోడ్డులో తన 8,063 చదరపు అడుగుల ఆస్తిని క‌లిగివున్నాడు. పాస్టర్ జాన్ వెంకటేశన్ 1980లో ఆస్తిలో కొంత భాగాన్ని అద్దెకు తీసుకుని ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ప్రైమ్ లొకేషన్‌లో ఉండటంతో దీని విలువ ఇప్పుడు దాదాపు రూ.12 కోట్లు. గోదండ‌రామ‌న్ కుటుంబం మొత్తం ఆస్తిని పాస్టర్ క్రమంగా ఆక్రమించాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

గోదండ‌రామ‌న్ కుమారులు శరవణ పెరుమాళ్, ధనశేఖర్, ధనంజేయన్, దశరథన్ తమ ఆస్తులను రికవరీ చేయడంలో సహాయం చేయాలని చెన్నై పోలీస్ కమీషనర్, సీఎం స్పెష‌ల్‌ సెల్‌కు పిటిషన్ వేశారు. ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, సీఎం ప్రత్యేక అధికారి, డీజీపీకి వినతిపత్రాలు పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఈ ఉదాసీన వైఖరితో విసిగిపోయిన శరవణ పెరుమాళ్, అతని కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు ఏప్రిల్ 29న సచివాలయానికి వెళ్ళి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎం స్పెషల్ సెల్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు మోకాళ్ళ‌పై నడిచారు. స్థానిక పోలీసులు పాస్టర్‌తో కుమ్మక్కయ్యారని, వారిపై కేసులు పెట్టారని, సీబీసీఐడీ విచారణ జరిపించాలని కోరారు.

కాగా,
స్వతంత్ర లేదా మతపరమైన పాస్టర్లు ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం కొత్త విషయం కాదు. చర్చి ఒక సంస్థగా భారత్‌లోని ప్రధాన భూ కబ్జాదారులలో ఒకటిగా త‌యారైంది. ఫిబ్రవరిలో తమిళనాడులో ఇసుక అక్ర‌మ తవ్వకాల కేసులో సైరో మలంకర బిషప్, ఐదుగురు పూజారులు అరెస్టు అయ్యారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో అయిదు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి కొండపై చర్చి నిర్మించారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి