News

హనుమను అవ‌మానించిన మహారాష్ట్ర మంత్రి అబ్దుల్ సత్తార్!

643views

ముంబై: దేశంలో హనుమాన్ చాలీసా హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ నవనీత్ కౌర్ మహారాష్ట్ర మంత్రి ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతా అంటూ సవాల్ విసరడం పెను దుమారం రేగింది. తర్వాత భారీ ఎత్తున శివసేన కార్యకర్తలు నవనీత్ కౌర్ దంపతుల ఇంటిని ముట్టడించడం.. నాటకీయ పరిణామాల మధ్య ఎంపీ దంపతుల అరెస్ట్, రిమాండ్ అంతా చకచకా జరిగిపోయాయి.

ఇప్పుడు తాజాగా… ఓ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మహారాష్ట్ర మంత్రి హనుమంతుడిని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీజేపీ నేత నితీష్ రాణే ట్విట్ చేసిన ఈ వీడియోలో మంత్రి అబ్దుల్ సత్తార్ హనుమంతుడిని దుర్భాషలాడుతున్నాడు. హనుమాన్ చాలీసాను అవమానించే విధంగా పదాలను వాడుతున్నాడు.

కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు, మంత్రితో పాటు మరికొంతమంది స్థానికులు ఈ వీడియోలో కన్పిస్తున్నారు. హనుమంతుడికి వ్యతిరేకంగా అసభ్య పదాలను మంత్రి అబ్దుల్ సత్తార్ వాడినట్టు వీడియోలో తెలుస్తోంది.

అయితే, కేవలం హనుమంతుడినే కాదు.. హనుమాన్ చాలీసా బహిరంగ పారాయణాన్ని సమర్ధిస్తూ సమావేశమైన స్థానిక ప్రజలపై సైతం మంత్రి మండిపడినట్టు తెలుస్తోంది. దీనిపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన సైతం స్పందించింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మంత్రి అబ్దుల్ సత్తార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి