
709views
ఈరోజు నెల్లూరులోని కస్తూరి దేవి గార్డెన్స్ నందు ఆరెస్సెస్ తీర ప్రాంత కార్యకర్తల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన తీర ప్రాంత గ్రామాల కార్యకర్తలు దాదాపు నాలుగు వందల మంది పాల్గొన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నెల్లూరులో చాలా కాలం పాటు పూర్తి సమయ కార్యకర్తగా పని చేసి ప్రస్తుతం దివ్యాంగుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న ‘సక్షం’ సంస్థ అఖిల భారత సంఘటనా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ సుకుమార్ జీ పాల్గొని మార్గదర్శనం చేశారు. అనంతరం నెల్లూరు పుర వీధులలో కార్యకర్తలు జరిపిన కవాతు ఎప్పటిలాగే ఉత్సాహంగా సాగింది. ఆరెస్సెస్ బ్యాండుతో అత్యంత క్రమశిక్షణతో కార్యకర్తలు జరిపిన కవాతును నగర ప్రజలు ఆసక్తిగా తిలకించారు.





