News

చాలించండి మీ నంగి వేషాలు – పాక్ పి. ఎం పై విరుచుకుపడ్డ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ.

1.6kviews

పుల్వామా పాపం పాకిస్థాన్ దేనని  ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. “ ముందు మీరు కప్పుకున్న అమాయకత్వం ముసుగు తొలగించండి” అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఒవైసీ విరుచుకు పడ్డారు. పుల్వామా దాడిలో పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం, పాక్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ల ప్రమేయం సుస్పష్టమని పేర్కొన్నారు. పుల్వామా దాడి ముమ్మాటికీ పాక్ సృష్టేనని, భారత ప్రజల ఐక్యతను చూసి పాక్ జీర్ణించుకోలేక పోతోందని ఒవైసీ చెప్పారు. ముంబైలో జరుగుతున్న ఒక ర్యాలీ లో మాట్లాడుతూ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు టీవీ కెమెరాల ముందు కూర్చుని మాకు సందేశాలివ్వ వద్దు. దీనిని మీరే ప్రారంభించారు. ఇది మొదటిది కాదు. పఠాన్ కోట్, యురి, ఇప్పుడు పుల్వామా. మీరు అమాయకపు ముసుగును తొలగించుకోండి అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని ఒవైసీ తీవ్రంగా హెచ్చరించారు. ఇంకొక అడుగు ముందుకేసి అజహర్ మసూద్ ని “అతను మౌలానా కాదు సైతాను” అని అభివర్ణించారు.