News

పాకిస్తాన్‌ బోట్ నుంచి హెరాయిన్​ స్వాధీనం

541views

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌ అరేబియా సముద్ర తీరంలో పెద్దమొత్తంలో హెరాయిన్‌ను భారత తీరప్రాంత రక్షణ దళం పట్టుకుంది. భారత్‌ వైపు వస్తున్న పాకిస్తాన్‌కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసింది. గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళంతో కలిసి ఈ ఆపరేషన్​ను చేపట్టింది.

రెండు దళాలు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్‌లో హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను.. కచ్‌ జిల్లాలోని జకావూ పోర్టుకు తరలించినట్టు అధికారులు తెలిపారు. పాకిస్తానీ బోట్ ‘అల్ హజ్’ భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడు తీర ప్రాంత రక్షణ నౌకలు అడ్డుకుని పట్టుకున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి