
582views
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని చద్ధా క్యాంపు సమీపంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. సీఐఎస్ఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. దాడి సమయంలో బస్సులో 15మంది జవాన్లు ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
ఉగ్రదాడిని బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టగా వారి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు సమీపంలోని సుంజ్వాన్ ప్రాంతానికి జారుకున్నారు. ఈ క్రమంలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా.. వారిపైనా ముష్కరులు ఎదురుకాల్పులు జరిపారు.





