
-
రుద్రాక్ష మాల వేసుకున్న విద్యార్థిని గాడిద అన్న క్రిస్టయన్ టీచర్
చెన్నై: తమిళనాడులోని మరో ప్రభుత్వ పాఠశాలలో క్రైస్తవ మతమార్పిడి యత్నం వెలుగులోకి వచ్చింది. ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తాను చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో రుద్రాక్ష మాల ధరించి, హిందూ దేవతల పేర్లు రాసినందుకు క్రైస్తవ ఉపాధ్యాయుడు తనను దుర్భాషలాడారని ఫిర్యాదు చేసింది.
తిరుపూర్‌లోని జైవాబాయి మునిసిపల్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్న ఒక బాలిక తన పాఠశాలలో క్రిస్టియన్ టీచర్లు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నారని, పట్టై (పవిత్రమైన బూడిద) ధరించినందుకు తనను దుర్భాషలాడుతున్నారని చెప్పింది. హిందూ మున్నాని పోస్ట్ చేసిన వీడియోలో, ఒక క్రిస్టియన్ తమిళ టీచర్ చేతులు జోడించి ప్రార్థించమని కోరినట్టు విద్యార్థిని చెప్పింది. పిల్లలు ఇండిక్ పద్ధతిలో చేతులు ముడుచుకున్నప్పుడు ఆమె వారి వేళ్లను కూడా క్రైస్తవ పద్ధతిలో మడవమని కోరింది.
ఒకరోజు క్లాస్ తీసుకుంటున్నప్పుడు “ఎవరు ప్రాణ త్యాగం చేసి, మమ్మల్ని రక్షించారు?” అని అడిగింది. ప్రతి పిల్లవాడు ఒక్కో విధమైన సమాధానం ఇచ్చాడని ఆ అమ్మాయి చెప్పింది. దానికి టీచర్ ఇలా అన్నాడు, “యేసు మన కోసం తన జీవితాన్ని ఇచ్చాడు. మీరెవరూ అతని పేరు ఎందుకు చెప్పరు?”. పిల్లల చేతిరాతను తనిఖీ చేయడానికి హోంవర్క్‌గా ఏదైనా రాయమని ఆ టీచర్ పిల్లలను కోరింది. వారు ఏమి రాయాలో తాను పేర్కొనలేదని అమ్మాయి చెప్పింది. కాబట్టి ఆమె తనకు నచ్చిన మురుగ, కృష్ణుడు, ఇతర హిందూ దేవతల పేర్లను రాసింది. అయితే, ఆ టీచర్ ఆమెను తిట్టి, అలాంటివి రాయకూడదని చెప్పింది.
విద్యార్థి కథనం ప్రకారం… క్రిస్టియన్ కూడా అయిన ఇంగ్లీష్ టీచర్, ఆమె ధరించిన పట్టై (త్రిపుంద్ర) వైపు చూపిస్తూ “అది వేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది?” అని అడిగారు. ఎక్కువ సమయం పట్టదని అమ్మాయి చెప్పింది.
రుద్రాక్ష మాల వేసుకున్నందుకు గాడిదా అని దుర్భాషలాడారు. క్రిస్టియన్ ప్రార్థనలు కూడా చేయాలని విద్యార్థులను కోరినట్టు బాలిక వెల్లడించింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని బాలిక హెచ్‌ఎంకు ఫిర్యాదు చేసింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Source: HINDU POST





