
ధర్మవరం: ఏపీలోని ధర్మవరంలో విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో డాక్టర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. అంబేడ్కర్ అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికత కోసం అహర్నిషలు పోరాడారన్నారు.
రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా ఉండి, శ్రమపడి రాజ్యాంగ రచన చేశారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వంతంత్ర భారత తొలి న్యాయ మంత్రి, జాతీయోద్యమంలో తొలి దళిత నేత, వృత్తి రీత్యా లాయరు, బౌద్ధుడు.. ఇలా ఆ మహనీయుడి గురించి ఎంతైనా చెప్పుకొవచ్చన్నారు. పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన అంబేడ్కర్ అడుగులు జాడలు మనకు నిత్యం ఆదర్శాలని అన్నారు.
వి.హెచ్.పి జిల్లా కార్యదర్శి పులిచెర్ల వేణుగోపాలు, ఆపస్ జిల్లా కోశాధికారి అన్నం, అరవింద్, సామాజిక సమరసత వేదిక జిల్లా కన్వీనర్ డాక్టర్ వాసుదేవన్, దుస్సాక్రిష్ట, ఆర్.ఎస్.ఎస్. జిల్లా కార్యవాహ సీ.కే.వివేకానంద తదితరులు పాల్గొన్నారు.





