News

ఇస్లామిక్ హింసాకాండ‌… చావు బ‌తుకుల్లో 16 ఏళ్ళ బాలుడు!

902views

ఖర్గోన్: మధ్యప్రదేశ్‌లోని రెండు వేర్వేరు పట్టణాల్లో నిర్వ‌హించిన‌ రామనవమి ఊరేగింపులపై జ‌రిగిన ఇస్లామిక్ హింసాకాండలో ఎనిమిది మంది పోలీసులతో సహా కనీసం 31 మంది గాయపడ్డారు. 16 ఏళ్ళ‌ శివం శుక్లా రాళ్ళ‌దాడి వ‌ల్ల తలకు తీవ్ర‌ గాయమై మృత్యువుతో పోరాడుతున్నాడు.

ఖర్గోన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ్ చౌదరికి బుల్లెట్ గాయమైంది. అతనితో పాటు, ఖర్గోన్‌లో ఆరుగురు పోలీసులతో సహా కనీసం 24 మంది గాయపడ్డారు. ఓ యువకుడు కత్తితో దూసుకురాగా, మరో యువకుడు కాల్పులు జరిపాడని ఎస్పీ తెలిపారు. బర్వానీ జిల్లాలోని సెంద్వా పట్టణంలో రామనవమి ఊరేగింపుపై ఇదే విధమైన రాళ్ళ దాడిలో, ఎస్‌హెచ్‌వో బల్దేవ్ సింగ్ ముజల్డే, మరో ఐదుగురు గాయపడ్డారు.

శివమ్‌ని ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం రాత్రి ఆపరేషన్ చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
హింస తర్వాత ఖర్గోన్‌లో రామనవమి ఊరేగింపును మధ్యలోనే వదిలివేయవలసి వచ్చింది. ఒక దేవాలయం కూడా ధ్వంస‌మైంది. మూర్తులు పగలగొట్టబడ్డాయి. రాత్రిపూట హిందూ దేవాలయాలు/ఆస్తులపై అగ్గి బాంబులు విసిరినట్టు ఆరోపించబడిన వీడియోలు ఉన్నాయి. పట్టణంలోని మిశ్రమ జనాభా ప్రాంతాల్లో నివసించే హిందువులు క‌ష్టాలు ఎలా వుంటాయో ఈ హింసాకాండ రుజువు చేసింది.

ఊరేగింపుదారులపై రాళ్ళు రువ్విన వారి ఇళ్ళు, దుకాణాలను కూల్చివేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. చట్టం ప్రకారం అల్ల‌ర్ల‌లో ధ్వంస‌మైన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టాన్ని తిరిగి పొందేందుకు క్లెయిమ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయబడుతోంది.

Source: Hindu Post

 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి