
685views
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకకు భారత్ అందిస్తోన్న సాయం పట్ల ఆ దేశ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య స్పందించారు. ఈ సందర్భంగా పెద్దన్న తరహాలో సాయం చేసినందుకు భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మా పొరుగు దేశం, పెద్దన్న అయిన భారత్ ఎల్లప్పుడూ మా వెన్నంటే ఉంటుంది.
భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మేం రుణపడి ఉంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంక్షోభం నుంచి కోలుకోవడం అంత సులువైన పని కాదు. కానీ, భారత్ లాంటి దేశాలు ఆపన్నహస్తం అందిస్తే త్వరగా ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశిస్తున్నాం’ అని జయసూర్య తెలిపారు.





