
395views
-
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్ ఇండియా విమానం ముంబయికి బయల్దేరినట్టు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్టు తెలిపారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని మంత్రి తెలిపారు. భారతీయుల తరలింపులో మంచి సహకారం అందించిన రొమేనియా విదేశాంగ శాఖ మంత్రి బోగ్దాన్ అరెస్కూకు కృతజ్ఞతలు తెలిపారు.
Source: EtvBharat





