News

బ్యూటీషియన్ ముసుగులో ముస్లిం మహిళ గంజాయి దందా

562views

విజయవాడ: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో బ్యూటీషియన్ ముసుగులో మహిళ చేస్తున్న గంజాయి దందా వెలుగు చూసింది. గుడ్లవల్లేరు సంత రోడ్డులో నివాసం ఉంటున్న బ్యూటీషియన్ హాలీ మున్నీసా బేగం ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఫ్రిడ్జ్​లో దాచిన 550 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు.

భర్తతో విడిపోయిన బ్యూటీషియన్ సాధిక్ అనే ప్రియుడితో సహజీవనం చేస్తోంది. ఇటీవలే ఆమె ప్రియుడు సాధిక్ గంజాయి కేసులో అరెస్టయ్యాడు. సాధిక్​ను పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. అతడిని తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు. సాధిక్ తెలిపిన వివరాల ప్రకారం బ్యూటీషియన్ హాలిమున్నీసా బేగం ఇంట్లో తనిఖీలు చేయగా, ఫ్రిడ్జ్​లో దాచి ఉంచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి