News

కాశ్మీర్ వాలా వెబ్‌సైట్ ఎడిటర్ ఫహద్ షా అరెస్టు

491views

క‌శ్మీర్‌: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కాశ్మీర్ వాలా అనే ప్రచార వెబ్‌సైట్ ఎడిటర్ ఫహద్ షాను పుల్వామా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతను 2010లో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా నకిలీ వార్తలను పోస్టు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు.

ప్రజల్లో భయాన్ని కలిగించే నేరపూరిత ఉద్దేశ్యంతో ఫోటోలు, వీడియోలు, పోస్ట్‌లతో సహా దేశ వ్యతిరేక కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నాడ‌ని తమ వ‌ద్ద‌ విశ్వసనీయ సమాచారం ఉందని పుల్వామా పోలీసులు తెలిపారు. లోయలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రజలను రెచ్చగొట్టడమే అప్‌లోడ్ చేసిన కంటెంట్ లక్ష్యమ‌ని వారు చెప్పారు.

“ఈ సోషల్ మీడియా వినియోగదారులు ఉగ్రవాద కార్యకలాపాలను కీర్తించడం, దేశంపై దుష్ప్రవర్తన, అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డ‌మే కాకుండా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీల ప్రతిష్ఠ‌టకు భంగం కలిగించే పోస్ట్‌లను అప్‌లోడ్ చేస్తున్నారని కూడా తెలిసింది” అని పుల్వామా పోలీసులు తెలిపారు. కాగా, ఫహద్‌పై 2018లో పలువురు బాధితులు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి