News

కుటిల చైనా!

545views
  • వింటర్ ఒలంపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా గల్వాన్ ద్రోహి నియామ‌కం

  • ఆగ్రహించిన ప్రపంచ దేశాలు

  • దౌత్యపరంగా బహిష్కరించిన భారత్

న్యూఢిల్లీ: బీజింగ్‌ వేదికగా జరగాల్సిన వింటర్ ఒలింపిక్స్‌ 2022కి ముందు డర్టీ డ్రాగన్ కంట్రీ చిల్లర డ్రామాలు మొదలు పెట్టింది. 2020లో లద్దాక్‌లోని గాల్వాన్ లోయలో భారత బలగాలపై దాడికి పాల్పడిన ఆ దేశ సైనికుడిని టార్చ్ బేరర్‌గా నియమించి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని భారత్‌ సహా పలు ప్రపంచ దేశాలు త్రీవంగా ఖండించాయి.

అగ్రరాజ్యం అమెరికా తీవ్రస్థాయిలో మండిప‌డింది. భారత్‌.. ఈ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించేందుకు నిర్ణయించుకుంది. కాగా, 2020 మే 5న గాల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన హింసాత్మక వాగ్వాదంలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ పోరాటంలో 40 మందికి పైగా చైనా సైనికులు సైతం మరణించారని ప్రపంచ మీడియా వెల్లడించింది. అయితే, చైనా ఈ విషయాన్ని అంగీకరించేందుకు ససేమిరా అంది. మ‌రో స‌ర్వే అయితే, వంద‌లాది మంది చైనా సైనికులు మృతి చెందార‌ని వెల్లడించింది.

నాడు భారత బలగాల చేతిలో గాయపడి ప్రాణాలతో బయటపడిన వ్యక్తినే(కి ఫాబావో) ప్రస్తుతం చైనా తమ ఒలింపిక్స్‌ టార్చ్‌ బేరర్‌గా నియమించింది. ఇదిలా ఉంటే, చైనా మానవ హక్కుల ఉల్లంగణకు పాల్పడుతుందంటూ అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు ఇదివరకే వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి