News

ఎల్.టి.టి.ఈ కోసం విరాళాలు సేకరిస్తున్న శ్రీలంక క్రిస్టియన్ మహిళ తమిళనాడులో అరెస్టు

534views

ల్టీటీఈ ఉద్యమం కోసం విరాళాలు సేకరిస్తున్న ఓ మహిళను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలంకకు చెందిన మేరీ ఫ్రాన్సిస్కో (40) గా ఆమెను గుర్తించారు. మేరీ ముంబయి వెళ్లేందుకు యత్నిస్తుండగా చెన్నై ఎయిర్ పోర్టులో ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

భారత్, కెనడా, సింగపూర్, మలేసియా దేశాల్లో అక్రమ పత్రాలు సృష్టించి విరాళాలు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.