NewsSeva

రాజమండ్రిలో సక్షం ఒకరోజు శిక్షణ వర్గ

950views

3/ 2/ 2019  ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాజమండ్రిలో సక్షం ఒక రోజు వర్గ జరిగింది. ఈ వర్గలో 50 మంది కార్యకర్తలు పాల్గొని వివిధ అంశాలలో శిక్షణ పొందారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు బొమ్మూరు వద్ద గల మహారోగి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించే అవకాశం కలిగింది. తమకు సమీపంలోనే ఇంత గొప్ప సేవా కార్యక్రమం జరుగుతూ వుండడం మహదానందాన్ని కలిగించిందని కార్యకర్తలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సక్షం అధ్యక్షులు డా|| శ్రీమన్నారాయణ, ఆరెస్సెస్ విభాగ్ సంఘచాలక్ శ్రీ సుబ్బరాజు, విభాగ్ ప్రచారక్ శ్రీ లక్ష్మణ్, సక్షం జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఉమాదేవి, కార్యదర్శి శ్రీ AVSN మూర్తి, సహ కార్యదర్శి శ్రీ విప్పర్ల రామారావు, కోశాధికారి శ్రీ మాధవరావు పాల్గొన్నారు.

స్థానిక కార్యకర్తలు వర్గ ఏర్పాట్లను పర్యవేక్షించారు.