NewsProgramms

ఊరూరా భారతమాత పూజ

104views

నంద్యాల పరిసర గ్రామాలలో భారతమాత పూజా కార్యక్రమాలు ధర్మజాగారణ సమితి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున జరిగాయి. ధర్మజాగారణ సమితి కార్యకర్తలు దేవాలయాలలో హైందవ సోదరులను ఏకత్రితం చేసి, భారత్ మాతా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయా దేవాలయాలలో నిరంతరం హిందూ ధర్మ ప్రచారం, భజన, సత్సంగం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అవసరమైన మౌళిక వసతులను కూడా కల్పిస్తున్నారు. అవసరమైన చోట, సౌండ్ సిస్టమ్, హార్మోనియం, తాళాలు, మృదంగం, డోలు, డక్కీ లాంటివి సమకూరుస్తున్నారు.

9-1 -22 వ తేదీ ఆదివారము సాయంత్రం 7.30 గంటలకు నంద్యాల మండలములోని చాపిరేవుల గ్రామములో భరత మాత పూజ జరిగింది. కార్యక్రమంలో భాగంగా దేశ సరిహద్దు రక్షణలో ప్రాణాలర్పించిన, చాపిరేవుల గ్రామమునకు చెందిన అమర వీరులు శ్రీ గోపాల్, శ్రీ జశ్వంత్ సింగ్ రావత్ లను గ్రామస్తులు, ధర్మజాగారణ సమితి కార్యకర్తలు స్మరించుకున్నారు. ఆ వీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.