News

మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి సీఎం ఫండ్‌!

385views
  • భగ్గుమన్న హిందూ జాగరణ్‌ మంచ్‌

భువనేశ్వర్‌: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి రూ.78 లక్షలకు పైగా మంజూరు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హిందూ జాగరణ్‌ మంచ్‌ ఒడిశా యూనిట్‌ శుక్రవారం రాజధాని భువనేశ్వర్‌లో నిరసన వ్యక్తం చేసింది.

సేవా ముసుగులో దేశ చట్టాలను తుంగలో తొక్కి, మతమార్పిడులకు పాల్పడే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం సిగ్గుచేటని మంచ్‌ ఆక్షేపించింది. నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం బుజ్జగింపుల అన్ని హద్దులను దాటిపోయిందని.. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని మంచ్‌ హితవు పలికింది.

మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని హిందూ జాగరణ్‌ మంచ్‌ రాష్ట్ర ఆర్గనైజేషన్‌ మంత్రి తన్మయ్‌ దాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వారు భూ చట్టాన్ని ఉల్లంఘించారని, జార్ఖండ్‌లో ఈ సంస్థ పిల్లలను విక్రయిస్తోందని ఆరోపించారు.

గుజరాత్‌ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశ చట్టాన్ని ధిక్కరించినట్టు ఈ మతమార్పిడి సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎవరైనా ప్రకృతి లేదా మరేదైనా విపత్తు లేదా తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధిని ఉపయోగిస్తారు.

దౌర్భాగ్యం ఏమిటంటే ముఖ్యమంత్రి సహాయనిధి సొమ్మును మతమార్పిడి చేస్తున్న సంస్థలకు ఈ సర్కారు అందజేస్తోందని తన్మయ్‌ దాస్‌ దుమ్మెత్తిపోశారు. ఈ బుజ్జగింపు రాజకీయాలను ప్రభుత్వం తక్షణం ఆపకపోతే రానున్న రోజుల్లో హిందూ జాగరణ్‌ మంచ్‌ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తుందని హెచ్చరించారు.

Source: VskOdissa

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి