
-
కాళీ ఆలయం, విగ్రహం ధ్వంసం
-
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్
షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఘోరం జరిగిపోయింది. మవ్బా ప్రాంతంలోని కాళీ దేవాలయాన్ని శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) షిల్లాంగ్‌లోని ఝలుపారా పోలీస్ ఔట్‌పోస్ట్‌లో పిటిషన్ దాఖలు చేసింది. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగిందని, నిందితులను అరెస్టు చేయాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది.
విరిగిన కాళీమాత విగ్రహాన్ని రెండోతేదీన ఉదయం ఆలయ పూజారి తొలిసారిగా గమనించారని వీహెచ్‌పీ పిటిషన్‌లో పేర్కొంది.ఈ ఘటన హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని కూడా వీహెచ్‌పీ కోరింది.
స్థానిక హిందూ నివాసితులు ఈ సంఘటనను దురదృష్టకరమని అభివర్ణించారు. ఇది హిందూ విశ్వాసంపై దాడిగా అభివర్ణించారు. ఎఫ్ఐఆర్ కాపీని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు పంపారు.
Source: Organiser





