
430views
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్తగా మనదేశంలో మూడో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తొలి అడుగుగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో డోసు వ్యాక్సిన్ ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 10వ తేదీ నుంచి మూడో డోస్ వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండో డోసు పూర్తయిన 39 వారాల తర్వాత మూడో డోస్ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అలాగే 60 ఏళ్లు పైబడిన వారికి సైతం వైద్యుల సలహాతో మూడో డోసు ఇవ్వనుంది.