తన అత్త సుమతి అమ్మాళ్ తనపై దాడి చేసిందని కనకదుర్గ చెబుతున్న మాటలలో నిజమెంత? కనకదుర్గ కుటుంబీకులతోబాటు స్వయానా కనకదుర్గ సోదరుడు స్థానిక సీపీఐఎం కార్యకర్త కూడా అయిన భరత్ భూషణ్ చెబుతున్న కథనం ప్రకారం ఘటన జరిగిన రోజు సహజంగానే మావోయిస్టు సానుభూతిపరురాలయిన కనకదుర్గ కొందరు సీపీఐఎం కార్యకర్తలతో కలిసి బలవంతంగా ఇంటిలోనికి జొరబడడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో గొడవ జరిగిన మాట వాస్తవమే అయినా ఆమె అత్త సుమతి అమ్మాళ్ కనకదుర్గపై దాడి చెయ్యలేదని, అప్పుడు జరిగిన తోపులాటలో వృద్దురాలైన సుమతి అమ్మాళ్ గాయ పడ్డారని తెలిపారు. చెప్పినట్లుగానే సుమతి అమ్మాళ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
” మీరు ఆలోచించండి ఈ వృద్దురాలు బరువయిన వస్తువును ఎత్తి ఎదుటివారిని గాయపరచగలదా?” అని ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ యువ నాయకుడొకరు ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇదంతా పోలీసులు, కమ్యూనిస్టు కార్యకర్తలు, మీడియా కలిసి ఆడుతున్న నాటకం అని ఆయన పేర్కొన్నారు.
బంధువులు చెబుతున్న దానిని బట్టి చూస్తే శబరిమల ఆలయంలో ప్రవేశించాలనే కనకదుర్గ పథకం గురించి కుటుంబ సభ్యులెవరికీ తెలియదు. విధి నిర్వహణలో భాగంగా తిరువనంతపురానికి వెళ్తున్నానని ఇంట్లో వారిని నమ్మబలికి ఇంతటి ఘాతుకానికి కనకదుర్గ తెగబడిందని, మీడియా ద్వారానే తమకు జరిగిన విషయాలు తెలిశాయని వారు వాపోతున్నారు.
Source: VSK, DELHI.