News

అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం

703views

అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం… ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ధార్మిక సమ్మేళనం… కోట్లాదిమంది ఒక్కచోట చేరే అద్భుత ఘట్టం.. పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య సమయం.. అదే కుంభమేళా.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో అర్ధకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. మకర సంక్రాంతి పర్వదినం నాడు ప్రారంభమైన అర్థ కుంభ మేళాకు.. ప్రపంచ నలుమూలల నుంచీ భక్తులు, యాత్రికులు, సాధువులు తరలివస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ లేనంత భారీ భద్రతా ఏర్పాట్లు చెయ్యడంతో సాధువుల రాక కూడా పెరిగిపోయింది. లక్షలాదిగా వస్తున్న భక్తులు… త్రివేణీ సంగమాన పవిత్ర స్నానాలు చేస్తున్నారు. పన్నెండళ్ళకొకసారి జరిగే కుంభమేళ పూర్తయ్యే రోజుకు 12కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనాలుండగా.. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఏడుగురు శైవ, ముగ్గురు వైష్ణవ, ఇద్దరు ఉదాసీన, ఒక సిక్కు రూపాలలో ఉన్న సాధువులు తొలిసారి ఆచరించే షాహీ స్నాన్‌తో కుంభమేళ ప్రారంభంమైంది. మరోవైపు…దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ప్రయాగరాజ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఐదున్నర కిలో మీటర్ల మేర 35 స్నాన ఘట్టాలలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు ఈసారి అక్షయ్‌ వాత్‌, సరస్వతి కూప్‌ల వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. అయితే.. 450ఏళ్ల కుంభమేళా చరిత్రలో ఈ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగ సాధువుల మంగళ స్నానాలతో ప్రారంభమైన కుంభమేళా మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది. 49 రోజులపాటు జరిగే అర్ధ కుంభమేళాకు యోగి అదిత్యానాథ్ ప్రభుత్వం 4వేల కోట్ల రూపాయలు కేటాయించింది. 192 దేశాల నుంచి 12 కోట్ల మంది భక్తులు వస్తారని అంచాన వేసిన అధికారులు.. 2వేల 800 కోట్ల రుపాయలతో దాదాపు 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, గంగా నది ఒడ్డులను కలుపుతూ 22 వంతెనలు నిర్మించారు. అంతేకాదు.. గంగానదీ పరివాహక తీరాన 45 కిలోమీటర్ల పరిధిలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

Source : Bharath Today
https://www.bhaarattoday.com/news/national/kumbh-mela/30277.html