News

కుంభమేళా చరిత్రలో మొట్టమొదటిసారిగా.. పుణ్యస్నానాలు ఆచరించిన ‘హిజ్రా’ అఖాడా సభ్యులు

771views

చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన ‘హిజ్రా’ బృందానికి అఖాడా గుర్తింపు దక్కింది. ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో హిజ్రాలకు చెందిన ‘కిన్నర్ అఖాడా’ బృందం పుణ్యస్నానాలు ఆచరించింది. ఈ సందర్భంగా కిన్నర్ అఖాడాకు చెందిన ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ కుంభమేళా చరిత్రలోనే ఇది మొట్టమొదటి ఘటన అని, ఈ ఘటన ద్వారా మేము కూడా ఈ సమాజంలో భాగమే అన్న బలమైన సందేశం అందరికి చేరుతుందని అన్నారు. తమ బృందాన్ని ‘లైంగిక పరిధులను అధిగమించిన అఖాడా’గా వ్యవహరిస్తున్నామని తెలిపారు. అఖాడాకు చెందిన ప్రధాన అర్చకురాలు ఆచార్య లక్ష్మీనారాయణ త్రిపాఠి ఈ సందర్భంగా మీడియాతో ఈ కుంభమేళాకు రావడం అనేది ఆధ్యాత్మిక దివ్యానుభూతినిచ్చిందని తెలిపారు.

Source: Organiser